పిండి వంటలతో నిరసన 

Jan 12,2024 17:10 #Konaseema
anganwadi workers strike 32nd day in konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం(డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ) : జీతాలు పెంచాలంటూ అంగన్వాడి వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 32 రోజుకు చేరుకుంది. రామచంద్రపురం కే గంగవరం మండలాలకు చెందిన సుమారు నాలుగు వందలు మంది అంగన్వాడి వర్కర్ల సేవలో పాల్గొన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని మహిళలంతా మెయిన్ రోడ్లపై పిండి వంటలు తయారు చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం మండవయకర్ విడనాడాలని అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం అంగన్వాడి వర్కర్ల కార్యదర్శి ఎం దుర్గమ్మ వరలక్ష్మి జహిరా, దేవి తదితరులు సమ్మెను ఉద్దేశించి ప్రసంగించారు. చర్చలు సఫలం కాకపోతే సమ్మెను మరింతకాలం కొనసాగిస్తామని సందర్భంగా వారు తెలిపారు.

➡️