పురస్కార గ్రహీత కాశీకు నర్సిపూడి ప్రముఖుల సన్మానం

Feb 4,2024 12:10 #Konaseema
Award recipient Kashi is honored by Narsipudi celebrities

ప్రజాశక్తి – ఆలమూరు : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన ఉత్తమ అర్చక బ్రహ్మ, ఉత్తమ సేవా పురస్కార అవార్డులు అందుకున్న మండలంలోని నర్సిపూడి శివాలయం అర్చకులు కాళ్ళకూరి కాశీ శేఖర్ బాబును గ్రామ ప్రముఖులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ సేవ పురస్కారం లభించడం ఆయన శ్రమకు తగ్గ ఫలితం అన్నారు. గ్రామస్తుల సేవలో ముందుకు వెళుతున్న కాశీకు రానున్న రోజుల్లో ఇటువంటి సేవా అవార్డులు మరిన్ని రావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానాల ఈవో ఎమ్మెస్సార్ కృష్ణ, మాజీ ఎఎంసి చైర్మన్ దున్నే స్వామినాయుడు, నేతలు వడ్డీ దొరయ్య నాయుడు, పంతాల భగవాన్, శ్రీవిద్య స్కూల్ అధినేత గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

➡️