మండుతున్న ఎండలు

Apr 13,2024 23:02

ప్రజాశక్తి-మండపేట

నిత్యం రద్దీగా జనంతో కిక్కిరిసిపోయి ఉండే కపిలేశ్వరపురం రోడ్డు శనివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారింది. మండుతున్న ఎండలకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎండ తీవ్రతతో పలు దుకాణాలు మూతపడుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాయకూరలు, నిత్యావసర తదితర వస్తువులను ప్రజలు కొనుగోలు చేసేందుకు బయటకు వస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లవలసిన వారు, వ్యవసాయ కూలీలు తలపాగా, గొడుగులు ధరించి ప్రయాణాలు సాగిస్తున్నారు. ఎండ నుంచి ఉపశమనం ఉండేందుకు దాహార్తిని తీర్చుకునేందుకు ప్రయాణికులు జూస్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. పండ్లు, ఐస్‌, జూస్‌ లకు వినియోగించే ఆహార పదార్థాల ధరలు పెరిగిన నేపథ్యంలో జూస్‌ రేట్లు కూడా పెంచి అమ్ముతునప్పటికీ జ్యూస్‌ సెంటర్లకు గిరాకీ పెరిగింది. జ్యూస్‌ సెంటర్‌ వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సెంటర్లలో నాణ్యత ఏర్పాట్లను అధికారులు పరిశీలించాలని పలువురు కోరుతున్నారు.

 

➡️