కుంగిన గోదావరి ఏటిగట్టు

May 18,2024 14:15 #Konaseema

పొంచి ఉన్న ప్రమాదం?

ప్రజాశక్తి-రామచంద్రపురం : కోటిపల్లి నుండి సుందరపల్లి మధ్య గల కుమ్మరి సావరం వద్ద గోదావరి ఏటిగట్టు కుంగిపోయి బలహీన పడింది. దీంతో ఏటిగట్టు రోడ్డు వరకు గోదావరి లోనికి మట్టి జారిపోవడంతో ప్రమాదకరంగా తయారయింది. రాత్రి సమయంలో ఈ ప్రాంతo లో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా వర్షాకాలంలో గోదావరి వరద నీటి ప్రవాహం పెరగడంతో పాటు ప్రతి సంవత్సరం ఆగస్టు నుండి అక్టోబర్ వరకు వరదలు సంభవిస్తుంటాయి. అటువంటి సమయంలో బలహీనంగా ఉన్న ఏటి గొట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో ఈ ప్రాంతంలో గ్రోయిన్ లను నిర్మించారు. అయినప్పటికీ వర్షాలకు మట్టి పూర్తిగా కొట్టుకుపోయి కొమ్మరి వారు సమరం వద్ద ఏటుకట్టు బలహీన పడింది గోదావరి పరివాహక ప్రాంత రక్షణాధికారులు కన్వర్వెన్సీ శాఖ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక ఎర్రజెండాను ఇక్కడ కట్టి అధికారులు చేతులు తెలుపుకున్నారు. వచ్చే వర్షాకాలంలోపు ఇక్కడ మరమ్మత్తులు చేపట్టకపోతే గోదావరి ఉధృతికి ఈ ఏటుకట్టు వద్ద ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉంది. గత ఏడాది బలహీనంగా ఉన్న గట్ల వద్ద ఇసుక మోటాలు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆ ఇసుక మూటలు కొట్టుకుపోవడంతో పరిస్థితి మళ్ళీ యధాస్థితికి చేరుకుంది. ఈసారి వర్షాకాలం రాకుండా ముందే మరమ్మత్తు పనులు చేపడితే ప్రయోజనం ఉంటుందని లేదంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందం గా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే దృష్టి సారించి జారిపోయిన ఏటికొట్టుకు మరమ్మతులు పూర్తి చేయాలని రోడ్డు ప్రమాదాలు నివారించాలని పరిసర ప్రాంతాల ప్రజలు ఏటిగట్టు వాసులు కోరుతున్నారు.

➡️