ఆదిలోనే అపశృతి…!

Mar 30,2024 15:24 #Konaseema

ప్రచార ర్యాలీలో టిడిపి గ్రామశాఖ అధ్యక్షుడు మృతి 

ప్రజాశక్తి-అమలాపురం : అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాదుర్, రాజోలు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ లు శనివారం సఖినేడిపల్లి మండలం అంతర్వేది లో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తాటిపాక గ్రామానికి చెందిన టిడిపి గ్రామ శాఖ అధ్యక్షుడు గుద్దటి వెంకటేశ్వరరావు (చిట్టబ్బాయి) (57) గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ప్రచారంలో విషాద చాయలు అలుముకున్నాయి.

➡️