అగ్ని ప్రమాద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయం

Jan 26,2024 16:38 #Konaseema
financail aid to fire accident victims

ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన జనసైనికుని కుటుంబానికి అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఇంఛార్జి డి ఎం ఆర్ శేఖర్ శుక్రవారం రూ.50 వేలు ఆర్ధిక సాయం అందజేశారు. గురువారం అర్ధరాత్రి అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామంలో జనసైనికుడు బొలిశెట్టి శివ ఇళ్ళు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. సర్వం కోల్పోయి నిరాశ్రయుడైన శివ కుటుంబాన్ని పలకరించిన జనసేన శ్రేణులు తక్షణ సాయంగా ఈ ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, సీనియర్ నాయకులు లింగోలు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, పోలిశెట్టి బాబులు, డాక్టర్స్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస, అల్లాడ రవి, నల్లా వెంకటేశ్వర రావు, పోలిశెట్టి కన్నా, కంకిపాటి గోపి, మద్దింశెట్టి ప్రసాద్, చేట్ల మంగతాయారు, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

➡️