ఆనాటి ఊసులు.. మదిలో సిరి మువ్వల సవ్వడులే…

Jan 19,2024 15:48 #Konaseema
get together in alamuru

ప్రజాశక్తి – ఆలమూరు : 2007 – 08 పదవ తరగతి విద్యార్థులైన మండలంలోని మూలస్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి పదవ తరగతి వరకు ఐదేళ్లు పాటు కలసి చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. మిత్రుల్లో ఇన్నేళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో వచ్చి ఆ’పాత’ మధురాలను పంచుకున్నారు. తమను తాము పరిచయం చేసుకుంటూ తరగతి గదుల్లో చేసిన అల్లరి చేష్టలను మరొకసారి గుర్తు చేసుకున్నారు. శాలువాలు, పూలదండలు, కానుకులతో తమ గురువులను సత్కరించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. పూర్వ విద్యార్ధుల కలయిక కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా ప్రజాహిత కార్యక్రమాలకు ఒకరికొకరు సహకరించుకునే విధంగా చేయూత నివ్వాలని పూర్వ విద్యార్థులు అన్నారు. ఎవ్వరికీ ఎలాంటి అవసరం వచ్చినా అందరం కలిసి భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తోట సతీష్, కంచుమర్తి సురేష్, ముచ్చర్ల రాజు, గుండు బోగుల ప్రసాద్, దేవరపూడి నాగేశ్వరరావు, తోట సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️