5రోజుల ముందే ఓటు వేయ్యొచ్చు

Mar 9,2024 15:19 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : వృద్ధులు, వికలాంగ ఓటర్ల కోసం ప్రభుత్వం హోమ్ ఓటింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని మండపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి డివిఎస్ ఎల్లారావు అన్నారు. శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాల వారీగా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాసిల్దార్ సురేష్ కుమార్ తో కలిసి ఆయన మాట్లాడుతూ 86 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వికలాంగుల కోసం ప్రభుత్వం హోమ్ ఓటింగ్ ను తీసుకువచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజులు ముందే వారి ఇంటి వద్దనే ఉండి ఓటు హక్కును వినియోగించుకోవచ్చునన్నారు. అయితే నిబంధనల ప్రకారం వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్ లోనే ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంటుందన్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పిఓలకు శిక్షణ అందించమన్నారు. ఎన్నికలు పది రోజుల ముందే వాటర్ లకు వాటర్ స్లిప్పులు తామే పంపిణీ చేస్తామన్నారు. నియోజవర్గంలోని మండపేట పట్టణం, రాయవరం కపిలేశ్వరపురం మండపం మండపేట మండలాల్లో 223 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 21,76, 45 మంది ఓటర్లు ఉన్నారన్నారు.

➡️