జగనన్న కాలనీలో కనీస వసతులులేవి?

May 27,2024 14:21 #Konaseema
  • రోడ్లు, డ్రైన్లు, మంచినీరు లేక ఇక్కట్లు

ప్రజాశక్తి-రామచంద్రపురం : జగనన్న కాలనీలో కనీస వసతులు లేక కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కే గంగవరం మండలంలోని దంగేరు గ్రామంలోనూ, అదేవిధంగా తామరపల్లి గ్రామంలోనూ నేటికీ కనీస వసతులు లేకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు గురవుతున్నారు. దంగేరు గ్రామంలో సుమారు 200 ఇల్లు, తామరపల్లిలో సుమారు 120 ఇళ్లు నిర్మాణాలు మొదలయ్యాయి. నాలుగేళ్లుగా అనేక ఇల్లు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఇల్లు నిర్మాణానికి వెళ్లేందుకు కనీసం రోడ్లు లేకపోవడంతో పలుచోట్ల జగనన్న కాలనీ ఇల్లు నిర్మించుకునేందుకు మెటీరియల్ తరలించేందుకు నిర్మాణదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికే కాలనీలో రోడ్లతో పాటు, డ్రైన్లు లేకపోవడం, మంచినీటి సౌకర్యం లేకపోవడంతో కాలనీలో నివాసం ఉండే ప్రజలు అయోమయంగా దిక్కుతో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రోడ్లు లేకపోవడంతో వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుందని, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇంట్లో వాడకం నీరు, వర్షం నీరు ఎటు వెళ్లే పరిస్థితిలేవు అని వాపోతున్నారు. ఇక కాలనీలో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో అక్కడక్కడికి వెళ్లి మంచినీరు తెచ్చుకోవాల్సి వస్తుందని కాలనీవాసులు తెలిపారు. ఇ ప్పటికైనా అధికారులు స్పందించి జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, మిగిలిన గృహాలు వేగవంతంగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

➡️