రాస్తారోకో, మానవహారంతో అంగన్వాడీల నిరసన

Dec 22,2023 15:12 #Konaseema
konaseema anganwadi workers strike on 11th day

ప్రజాశక్తి-రామచంద్రపురం : అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఆనంతరం మానవ హారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని, జీతాలు పెంచాలని, నినాదాలు చేశారు. ఆందోళన కార్య క్రమానికి కే వి పి ఎస్ రాష్ట్ర నాయకులు మాల్యాద్రి, సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరావు, జనసేన నాయకులు చిక్కాల దొరబాబు ,తదితరులు పాల్గొని ప్రసంగించారు.వెంటనే అంగన్వాడి వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సి ఐ టి యు జిల్లా కార్యదర్శి నూకల బలరాం,అంగన్వాడి యూనియన్ నాయకులు ఎం దుర్గా, రామచంద్రపురం, కే, గంగవరం మండలాల పరిధిలోని అంగన్వాడి వర్కర్లు కార్య క్రమం లో పాల్గొన్నారు.

➡️