కౌలు రైతుల శ్రమదానం

Feb 16,2024 11:32 #Konaseema
Labor of tenant farmers

పంట కాలువలో చెత్తాచెదారం తొలగించుకున్న రైతులు

ప్రజాశక్తి-రామచంద్రపురం : పంట కాలువ లో సాగు నీటి లభ్యత తగ్గుతుండడంతో కౌలు రైతులు శ్రమదానం చేసి పంట కాలువలు బాగు చేసుకుంటున్నారు. వేసవిలో పంట కాలువలు బాగు చేయకపోవడంతో తొలకరిలోనూ, దాల్వాలోను రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. రోజురోజుకు ముదురుతున్న ఎండలతో సాగునీరు పంట కాలువలకు అంతంత మాత్రమే అందుతుంది. దీంతో కౌలురైతులు శ్రమదానం చేసి పంట కాలువలోని చెత్తాచెదారం తొలగించుకుంటున్నారు. కే గంగవరం మండలంలోని శివల నుండి గుడిగళ్ల వరకు గల జమ్మల మెరక కాలువకు సాగునీరు అంతంత మాత్రమే రావడంతో కౌలు రైతులంతా సుమారు 50 మంది రెండు కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కాలువలో నాచు చెత్తాచెదారం గడ్డి మొక్కలు తొలగించారు. దీనివల్ల సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగి కాలువలో వచ్చే నీరు సక్రమంగా పంట పొలాలకు అందుతుందని రైతులు భావిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కాలువలో నీటి సాంద్రత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని వేసవిని దృష్టిలో ఉంచుకుని సాగునీరు పూర్తిగా అందించాలని. దీని ద్వారా దాల్వపంట గట్టేక్కుతుందని కౌలు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కాలువలపై పర్యవేక్షణ పెంచి శివారు భూములకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని రైతన్నలు కోరుతున్నారు.

➡️