మండపేటలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు

Jan 4,2024 13:25 #Konaseema
louis braille birth anniversary

ప్రజాశక్తి-మండపేట : స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ, ఉపాధ్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్ లు విద్యార్థులతో కలిసి లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లూయిస్ బ్రెయిలీ మూడు సంవత్సరాల వయసులో కంటి చూపును ప్రమాదవశాత్తు కోల్పోయి అకుంఠిత కృషితో యావత్ అంధులు విద్యనభ్యసించేందుకు బ్రెయిల్ లిపిని అభివృద్ధి చేశాడని వారందరికి ఆరాధ్య దైవం అయ్యాడన్నారు.

➡️