సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

Mar 22,2024 13:31 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : ప్రభుత్వం అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ సింహాచలం, హెల్త్ సూపర్వైజర్ సురేష్ అన్నారు. శుక్రవారం స్థానిక రావులపేట, గొల్లపుంత కాలనీలలోని అంగన్వాడీ కేంద్రాలలో ఏర్పాటుచేసిన
పౌష్టికార పక్షోత్సవం కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంతోనే మేలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకపోషక విలువలున్న పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త ప్రభావతి, ఆయా దేవి, ఆశ కార్యకర్త రాజేశ్వరి కాలనీల మహిళలు పాల్గొన్నారు.

➡️