పది పరీక్షలకు మండపేట రెడీ

Mar 16,2024 14:37 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : ఈ నెల 18 తారీకు సోమవారం నుండి 30 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మండల విద్యా శాఖాధికారి నాయుడు రామ చంద్రరావు అన్నారు. శనివారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ ఈ ఏడాది మండపేట మండలానికి సంబంధించి మొత్తం 1800 మంది పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో బాలురు 939 బాలికలు 861 మంది ఉన్నారన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 1101, ప్రైవేటు పాఠశాల నుంచి 789 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. ఇందులో ఇంగ్లీష్ మీడియం 1543 తెలుగు మీడియం 257 మంది ఉన్నారన్నారు. మండపేట పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, భాష్యం, బాలిక ఉన్నత పాఠశాల, సెంటెన్స్, మండలంలో తాపేశ్వరంలోని శ్రీ చైతన్య, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ద్వారపూడి, ఏడిద గ్రామాలలో ఉన్న బాలిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రభుత్వం పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిందన్నారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12:45 పడుకో పరీక్ష జరుగుతుంది అన్నారు. విద్యార్థులు హాల్ టికెట్ ను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలన్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రానికి తీసుకురాకూడదన్నారు.

➡️