వైసిపిలో పలువురు చేరిక

Apr 22,2024 23:10
వైసిపిలో పలువురు చేరిక

ప్రజాశక్తి-రాజోలుశివకోడు కందికట్ల వారి గ్రూపు, 18 ఎకరాల కాలనీకి చెందిన 30 మంది యువకులు సర్పంచ్‌ నక్కా రామారావు అధ్యక్షతన సోమవారం వైసిపిలో చేరారు. వీరికి వైసిపి అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి పార్లమెంట్‌ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్‌ను ఎంఎల్‌ఎ అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో వైఎస్‌.జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందికట్ల వారి గ్రూపు అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు చింతా ప్రసాద్‌, చింతా శ్రీనివాస్‌, రావి విజరు, తాడి సూరిబాబు, దాకే చంద్రశేఖర్‌, బొంతు చందు, కందికట్ల శ్యామరాజు పాల్గొన్నారు.

➡️