సికెల్ సెల్ ఎనీమియా పై అవగాహన

Jun 20,2024 18:06 #Konaseema, #Sickle Cell Anemia

ప్రజాశక్తి – రామచంద్రపురం : పట్టణం లోని ఏరియా ఆసుపత్రిలో గురువారం సికేల్ సెల్ ఎనీమియా పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్ మాట్లాడారు. సికిల్ సెల్ ఎనీమియా ప్రజల్లో అవగాహన కలిగించాలని దీనివల్ల ఒక్కొక్కసారి ప్రాణాంతకం కావచ్చు అని వివరించారు. గుండ్రంగా ఉండే ఎర్ర రక్త కణాలు సికిల్ సెల్ ఎనీమియా వల్ల కొడవలి ఆకారంలో మారి రోగికి అతి నీరసం కాళ్లు వాపు, నీరు చేరడం వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని వీటిని గుర్తించిన వెంటనే ఏరియా ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందాలన్నారు. అదేవిధంగా జులై 3 వరకు దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలోనూ సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు ఉచితంగా చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️