వైసిపి పార్టీకి రాజీనామచేసిన సర్పంచ్

Jun 20,2024 17:54 #ambedkar konaseema

ప్రజాశక్తి -మామిడికుదురు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బి. దొడ్డవరం గ్రామ వైసీపీ సర్పంచ్ చెల్లుబోయిన రామ శివ సుబ్రమణ్యం ( రామయ్య )గురువారం తెలిపారు. తన వ్యక్తిగత ఇబ్బందులు దృష్ట్యా పార్టీకి రాజీనామా చేస్తున్నానని , గత ప్రభుత్వ హయంలో గ్రామ అభివృద్ధికి సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతకాలం వైసీపీ లో ఉంటూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కట్టుబడి పనిచేశానని , ఇక మీదట కొనసాగలేక పార్టీకి రాజీనామా చేస్తున్నానట్లు తన రాజీనామా లేఖను మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ముల రాముకి అందజేస్తానని అన్నారు. వైసిపి పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నానని గ్రామ సర్పంచ్ గా కొనసాగుతు ప్రజలకి అన్నివేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రస్తుతానికి వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదన్నారు

 

➡️