మెయిన్ రోడ్లను ఆధునీకరించండి 

Jun 14,2024 11:45 #Konaseema

మంత్రి సుభాష్ కు వినతి

ప్రజాశక్తి-రామచంద్రపురం : రామచంద్రపురం నియోజవర్గ పరిధిలో పలు మెయిన్ రోడ్లు పూర్తిగా పాడై అధ్వానంగా ఉన్నాయని వాటిలో యానాం జొన్నాడ ఏటుగట్టు కూడా ఉందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ కు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు విజ్ఞప్తి చేశామని మసకపల్లి గ్రామానికి చెందిన రవ్వ భూషణం తెలిపారు. ఆయన విజయవాడలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బుచ్చి రాజులను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రవ్వా భూషణం మాట్లాడుతూ యానం జొన్నాడ ఏటిగట్టు రోడ్డు ఆధునికరించి యానం హైవే నుండి జొన్నాడ హైవే వరకు డబల్ రోడ్డు చేస్తే రెండు హైవే లను కలిపే ప్రధానమైన రోడ్డు కాగలదని , దీంతో మూడు నియోజకవర్గాలు కలిసి నటువంటి తీర ప్రాంత గ్రామాలన్ని ఎంతో అభివృద్ధి చెందుతాయని మంత్రి సుభాష్, ఎమ్మెల్యే బుచ్చి రాజులకు భూషణం వివరించారు. ఇసుక లారీలు తిరగడం వల్ల ఈ రోడ్డు పూర్తిగా పాడైపోయి ఉందని, వీటితో పాటు ఇంకా నియోజకవర్గంలో పలు రోడ్లు పాడై ఉన్నాయని వాటి వివరాలను తెలియజేశారు. దీనిపై మంత్రి సుభాష్, మాట్లాడుతూ తప్పనిసరిగా రోడ్డు అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు భూషణం ప్రజాశక్తి దినపత్రికకు వివరించారు.

➡️