తాగునీటి సమస్య తీర్చండి..

Jan 29,2024 17:10 #Konaseema
mp bose on water problem

మండల సర్వసభ్య సమావేశంలో సభ్యుల డిమాండ్ 
మండల సమాఖ్య, స్త్రీ నిధి నిధుల అవకతవకలపై విచారణ జరపాలి ఎంపీ బోస్

ప్రజాశక్తి-రామచంద్రపురం : కే గంగవరం మండలంలోని అన్ని గ్రామాల్లోనూ తాగునీటి సమస్య అధికంగా ఉందని దీనిని వెంటనే పరిష్కరించాలని పలు గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు మండల సమావేశంలో అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. కే గంగవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పంపన నాగమణి అధ్యక్షతన సోమవారం జరిగింది. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్యఅతిథిగా పాల్గొనీ ప్రసంగించిన ఈ సభలో సభ్యులు వేసవి వస్తుందని గ్రామాల్లో తగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. కూళ్ల, సుందరపల్లి, మసకపల్లి, ఎర్ర పోతవరం, పాతకోట, కోటిపల్లి గ్రామాల్లో, తాగునీటి సమస్య అధికంగా ఉందని ఆయా గ్రామాలను సర్పంచ్లు సమావేశంలో తెలిపారు ఎర్ర పోతవరంలో రెండేళ్లుగా మంచినీటి ట్యాంకు పనిచేయడం లేదని, గ్రామంలో 370 కొళాయిలు వేయవలసి ఉండగా కాంట్రాక్టర్ 30 కుళాయిలు మాత్రమే వేశారని ఎర్ర పోతవరం సర్పంచ్ పిల్లి రాంబాబు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. సభలో మంత్రి మాట్లాడుతూ మండలo అంతా మంచినీటి సమస్య ఉత్పన్నమైందని వేసవి ప్రారంభమవుతున్న సమయంలో మంచినీటి అవసరాలు ఇంకా పెరుగుతాయని వీటిని వెంటనే పరిష్కరించాలని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారులకు సూచించారు. మంచినీటి సమస్య పరిష్కారానికి నిధులు కొరతలేదని వెంటనే గ్రామాల్లోనూ మంచినీరు అందించే ఏర్పాట్లు చేయాలని దీనికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని అవసరమైతే ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేయాలనీ ఆయన ఆదేశించారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇంకా ఇవ్వలేదని, జగనన్న కాలనీలకు రోడ్డు సదుపాయం లేక గృహ నిర్మాణాలు జరగటం లేదని పలువురు సభ్యులు సభలో వివరించారు. ఇంకా కొన్ని గ్రామాల్లో పట్టాలు కూడా ఇవ్వలేదని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కుందూరు, కే గంగవరం గ్రామాల్లో భూమి సేకరణ కూడా జరగలేదని అక్కడ ఇంకా లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వలేదని సభ్యులు తెలిపారు అదేవిధంగా ఎన్ ఆర్ జి ఎస్ పనుల్లో ఉపాధి కూలీలకు ఎప్పటి వరకు రూ.7కోట్ల 99 లక్షల రూపాయలు కూలి పనులు నిమిత్తం చెల్లించామని, మొత్తం పనులు 10 కోట్లకు పైగా నిర్వహించినట్లు గణపతి సభలో తెలిపారు. 20 వేలమంది ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అదేవిధంగా రెండో పంటకు సాగునీరు సక్రమంగా అందించాలని తామరపల్లి, బట్లపలిక, బదిలంక వద్ద కాలువ సమస్యలు ఉన్నట్లు ఇరిగేషన్ ఏ.ఈ సుబ్బారావు దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో బోసు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులకు అధికారులు పూర్తిస్థాయి సమాచారం అందించాలని ఇల్లు ఎన్ని మంజూరైన ఇంకా ఎన్ని ఇవ్వవలసి ఉంది వంటి సమాచారాలు అధికారులు గ్రామ ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా మండల సమాఖ్య, నిధులు, స్త్రీ నిధి, గ్రామ స్థాయిలో నిధుల దుర్వినియోగం జరిగిందని తన సొంత గ్రామమైన హసన్ బాధ లోను అవకతవకలు జరిగినట్లు బోస్ వివరించారు. ప్రతి గ్రామంలోనూ స్త్రీ నిధి సొమ్ములు రూ పది లక్షల నుండి 12 లక్షల వరకు దుర్వినియోగం జరిగిందని దీనిపై గ్రామస్థాయిలో విచారణ చేపట్టి దోషు లను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్. శ్రీనివాస్, జడ్పిటిసి ఓబులనేని వరలక్ష్మి, తాసిల్దార్ వైద్యనాథ శర్మ, వైస్ ఎంపీపీలు నీతి పూడి మధుబాల, దూడల నాగేశ్వరరావు, డీసీఎంఎస్ డైరెక్టర్ పెట్టా శ్రీనివాసరావు, హౌసింగ్ డిఇ మల్లికార్జునరావు, ఆర్ అండ్ బి జె ఈ ,కిషోర్ కుమార్, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, సిడిపిఓ వరాహ లక్ష్మి, శేరిలంక పి.హెచ్.సి వైద్యులు మణి, వైసిపి నాయకులు పంపన సుబ్బారావు, తోకల శ్రీనివాస్, ఓబులనేని రాజకుమార్, వాసంశెట్టి సూరిబాబు, కొప్పిశెట్టి లక్ష్మణ్, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు పాల్గొన్నారు.

➡️