వైసీపీ వైద్య విభాగ ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్ బాబు

Jan 29,2024 17:04 #Konaseema
prasad babu as ycp dist leader

ప్రజాశక్తి – ఆలమూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ జిల్లా వైద్య విభాగ కమిటీని అధిష్టానం నియామకాల్లో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని మడికికి చెందిన డాక్టర్ యు.ప్రసాద్ బాబు నియమితులయ్యారు. పార్టీ ఆవిర్భావం నుండి చురికైనా పాత్ర పోషిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పక్కాగా అమలు చేస్తూ కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి దృష్టిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ సేవలకు ప్రతిఫలంగా ఎమ్మెల్యే చిర్ల సిఫార్సు మేరకు జిల్లా స్థాయి వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి పదవి రావడం తనకెంతో ఆనందకరమని తెలిపారు. తనను ప్రోత్సహిస్తూ ఈ పదవి రావడానికి కారుకులైన ఏఎంసి చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, మండల వైకాపా కోఆర్డినేటర్ తమ్మన శ్రీనివాసు, ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, నెక్కింటి వెంకటరాయుడు (బుజ్జి), యు.సుందర విజయం, సర్పంచ్ యు.లక్ష్మి మౌనిక చిన్న, ఉప సర్పంచ్ పడమటి సుజాత రాంబాబు, పలువురు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️