రామాలయమే పాఠశాల 

Mar 28,2024 13:55 #Konaseema

రెండేళ్లుగా పూర్తికాని శివల పాఠశాల ఆధునీకరణ

ప్రజాశక్తి-రామచంద్రపురం : రెండేళ్లుగా మొదలైన పాఠశాల భవనం ఆధునీకీకరణ పనులు పూర్తికాక విద్యార్థులంతా రామాలయంలోనే చదువు కుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇవి కే గంగవరం మండలంలోని శివల గ్రామంలో గల దళిత వాడలో ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు పనుల కింద సుమారు 12 లక్షలు మంజూరు చేసారు. ఇక్కడ స్లాబ్ లీక్ అవ్వడంతో దానిని కూల్చివేశారు. అయితే రెండేళ్లు గడిచిన పాఠశాల అభివృద్ధి పనులు పూర్తికాలేదు. దీనితో విద్యార్థులను ఇక్కడ గల రామాలయంలోకి తరలించారు. రామాలయంలోని హాల్లో ఐదు తరగతులు ఒకే చోట నిర్వహించడంతో ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు ఇక్కట్లు తప్పడం లేదు. సుమారు 26 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు టేకు శ్రీనివాస్ మరో ఉపాధ్యాయులు రంగారావు లు ఈ విషయమై ప్రశ్నించగా పాఠశాలకు మంజూరైన నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో పనులు ఆలస్యం అయ్యాయని నిధులు మంజూరైన తర్వాత పనులు పూర్తవుతాయని అంతవరకు ఇక్కడే విద్యాభ్యాసం కొనసాగిస్తామని వివరించారు.

శివల గ్రామంలో రెండేళ్లుగా పాఠశాల ఆధునీకరణ పనులు పూర్తికాలేదని విద్యార్థులు అంతా చిన్న రామాలయంలో ఒకే చోట గదిలో ఇరుకుగా ఉంటున్నారని మండల విద్యాశాఖ అధికారి ఎ నాగరాజు ను వివరణ కోరగా నాడు నేడు పనుల్లో రావాల్సిన రివాల్వింగ్ ఫండ్ ఆలస్యం కావడంతో సమస్యలు ఒప్పందం అయ్యాయని ప్రస్తుతం రివాల్వింగ్ ఫండ్ మంజూరు అయిందని పనులు వేగంగా పూర్తి చేస్తామని ఆయన వివరించారు.

➡️