వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ

Mar 29,2024 12:05 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : మండపేట వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షులు కొన సత్యనారాయణ ఎంపికయ్యారు. శుక్రవారం స్థానిక బురగుంట చెరువు వైఎస్ఆర్ పార్క్ లో శుక్రవారం మహాత్మా గాంధీ వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక  నిర్వహించారు. అధ్యక్షుడిగా సత్యనారాయణ, కార్యదర్శిగా యోగా గురువు షేక్ అబ్బాస్  కోశాధికారి రావూరి సత్యనారాయణలు  ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన పార్కుల్లో ఒకటైన వైయస్సార్ పార్క్ ను తమ యూనియన్ ఐక్యత  అందరి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లంక సత్యనారాయణ, తిరుశూల వెంకట్రావు,గంపల సత్యప్రసాదు,వీర్రాజు, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

➡️