క్రీడాకారుల సమస్యలు పరిష్కరిస్తా : సూర్యప్రకాశ్

Mar 31,2024 12:21 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : పట్టణంలో శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు గ్రౌండ్ లో క్రీడా కారులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రీడాకారులను వాకర్స్ అసోసియేషన్, బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియం ఆటగాళ్లను ఆయన ఆప్యాయంగా పలకరించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి బలపరచాలని సూర్య ప్రకాష్ కోరారు. క్రీడాకారులు వాకర్స్ పెద్దలు గ్రౌండ్ లో సమస్యలను తెలియజేయగా తప్పకుండా గ్రౌండ్ ని అందరికీ ఉపయోగపడేలాగా అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాథంశెట్టి శ్రీదేవి శ్రీధర్ వైస్ చైర్మన్ నాగేశ్వరరావు, వార్డ్ కౌన్సిలర్ కేత సుజాత శ్రీనివాసరావు, వివిధ వార్డు కౌన్సిలర్లు, తొగరు మూర్తి, శీలం గంగరాజు, గుణ్ణం వెంకటేశ్వరరావు, పెంటపాటి శ్రీనివాసరావు, పోతంశెట్టి గోపాలకృష్ణ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

➡️