మండపేటలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం

Mar 29,2024 14:56 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : స్థానిక టిడిపి కార్యాలయం, రాయవరం మండలంలోని చెల్లూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 42 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబుతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమానులు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని  ప్రజలకు అనేక సంక్షేమ పార్టీ పథకాలు, సంస్కరణలో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అని పార్టీ 42 సంవత్సరాల సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో చెల్లూరు గ్రామ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు, నూనె ఏసుబాబు, దేవు శ్రీను, పసల ప్రసాద్, కాదా శ్రీను, దార్ల సుధీర్ బాబు, కొప్పిశెట్టి డ్రైవర్ శ్రీను పాల్గొన్నారు

➡️