పోలీసుల అదుపులో దొంగలు

Apr 10,2024 15:40 #Konaseema
  • సమస్య ఏదైనా 24 గంటలలో పరిష్కారం..
  • దటీజ్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి అంటున్న స్థానికులు…

ప్రజాశక్తి-నార్పల : ఇటీవల కాలంలో మండల కేంద్రమైన నార్పల లో స్థానిక గూగూడు రోడ్డు, దుగుమర్రి రోడ్డు లో పలు దుకాణాలు పగలగొట్టి వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారని ఈ దొంగలు నార్పల లొనే కాదు ఇంకా పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. నార్పల మండలంలో చోరీ కేసు గాని హత్య కేసు గాని సమస్య ఏదైనా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని స్థానిక సిబ్బంది సహకారంతో 24 గంటల్లోనే సమస్యను ఛేదిస్తుండడం గమనార్హం. దీంతో స్థానికులు దటీజ్ఐ ఎస్సై రాజశేఖర్ రెడ్డి అంటూ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విధి నిర్వహణలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు అని ప్రతిరోజు రాత్రిపూట కూడా గస్తీ తిరుగుతున్నారు అని స్థానికులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు.

➡️