సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం : కొండపల్లి

Apr 13,2024 21:33

ప్రజాశక్తి-బొండపల్లి : వైసిపి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలో నెలివాడ, కెరటం గ్రామాలలో ఉపాధి హామీ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారికి సకాలంలో పని వేతనం , కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందా? అని అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని వడగాల్పులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌ సూచించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. టిడిపి సూపర్‌ సిక్స్‌ పథకాలతోనే ప్రజలు కష్టాలు తీరుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెరటాం సర్పంచ్‌ నంబూరి రాజేష్‌, నెలివాడ మాజీ సర్పంచ్‌ హైమావతి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కూటమి అభ్యర్ధి మాధవి ఇంటింట ప్రచారం పూసపాటిరేగ : గెలుపే ధ్యేయంగా ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధి లోకం మాధవి మండలంలోని గోవిందపురం, భరణికాం, లంకలపల్లి పాలెంలో టిడిపి నాయకులతో కలిసి శనివారం ఇంటింటా ప్రచారం చేశారు. భరణికాం చెరువులో ఉపాధి పనులు చేస్తున్న మహిళలతో మాట్లాడారు. తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి కూటమిని గెలిపించుకోవాలన్నారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్ది మాదవమ్మను గెలిపించాలని టిడిపి నాయకులు ప్రచారం చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నం నాయుడు, నాయకులు దంగా భూలోకా, సింహాచలం, ఆకిరి ప్రసాదరావు, దంతులూరి సూర్యనారాయణరాజు, పసుపులేటి శ్రీనివాస రావు, జనసేన మండల అధ్యక్షలు జలపారి శివ, పతివాడ శ్రీను, పులపా మల్లేశ్వర్రావు, నక్కాన రమణ, బాలా అప్పలరాజు, శంకాభత్తుల సత్తిబాబు, మహంతి శివ, రౌతు నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️