కృష్ణాలో 28 నామినేషన్లు

Apr 23,2024 23:15

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

కృష్ణాజిల్లాలో నామినేషన్ల స్వీకరణ ఐదో రోజు మంగళవారం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వల్లభనేని అనుదీప్‌ జనసేన పార్టీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు, ఆదోతు తులసీరామ్‌ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ తరపున రెండు సెట్లు, సింహాద్రి రామ్‌ చరణ్‌ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌, అంబళ్ల రాజ్‌కుమార్‌ జై భారత్‌ నేషనల్‌ పార్టీ తరపున ఒక సెట్‌ నామినేషన్‌, వల్లభనేని నాగ పవన్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గన్నవరం అసెంబ్లీ స్థానానికి కళ్లం వెంకటేశ్వరరావు సిపిఎం తరపున ఒక సెట్‌ , షేక్‌ చాన్‌ బాషా స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ , సింహాద్రి రాఘవేంద్రరావు బహుజన సమాజ్‌ పార్టీ తరపున ఒక సెట్‌, అజరు పైల నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున రెండు సెట్లు, తెల్లాకుల వెంకట లక్ష్మణస్వామి సిపిఎం తరపున ఒక సెట్‌, అరుణకుమారి పత్తిపాటి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గుడివాడ అసెంబ్లీ స్థానానికి రాము వెనిగండ్ల టిడిపి తరపున ఒక సెట్‌, పెడన అసెంబ్లీ స్థానానికి రేవతి దేవి సబ్బిశెట్టి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున ఒక సెట్‌, మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి పేర్ని వాకా సాయి కృష్ణమూర్తి వైసిపి తరఫున మూడు సెట్లు, ఈడే భాస్కరరావు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌, ఆదోతు తులసీరామ్‌ తెలుగు రాజాధికార సమితి పార్టీ తరపున రెండు సెట్లు, సునీల్‌ బాబు కోటప్రోలు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌, అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ముంగర వెంకట నాంచారయ్య పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున ఒక సెట్‌, నాగేశ్వరరావు గుంటూరు బహుజన సమాజ్‌ పార్టీ తరపున ఒక సెట్‌, గిరిధర్‌ నాయుడు నాదెళ్ల స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్‌, పామర్రు అసెంబ్లీ స్థానానికి మంగం రాజమనోహర్‌ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున ఒక సెట్‌, పెనమలూరు అసెంబ్లీ స్థానానికి శశిధర్‌ మరీదు తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ తరపున ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

➡️