పోరాటయోధుడు అంబేద్కర్‌

Apr 14,2024 00:00

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

పీడీత ప్రజల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించిన పోరాట యోధులు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అని ఎల్‌ఐసి మచిలీపట్నం డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ డాక్టర్‌ జి.సుధాకర్‌ బాబు అన్నారు. అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా మచిలీపట్నం ఎల్‌ఐసి ప్రాంగణంలో ఐసిఇయు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం-విశిష్టత అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో సుధాకర్‌బాబు మాట్లాడుతూ రాజ్యాంగ విశిష్టతను, రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్‌ ను ఏవిధంగా పొందుపరిచారో వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిఇయు అధ్యక్షులు జె.సుధాకర్‌, జి.కిషోర్‌కుమార్‌, టి. చంద్రపాల్‌, కె.రాజ శేఖర్‌, వి.ఠాగూర్‌, కె.బుల్లయ్య, ఎన్‌.సుబ్రహ్మణ్యం, రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు.

➡️