అంబేద్కర్‌ ఆశయాలు ఆదర్శనీయం

Apr 14,2024 23:23
  • జయంతి కార్యక్రమాల్లో వక్తలు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

అంబేద్కర్‌ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ డికే బాలాజీ అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 133వ అంబేద్కర్‌ జయంతి వేడుకలు కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్‌ భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘసంస్కర్త, విద్యావేత్త, ఆర్థికవేత్త అని కొనియాడారు. ఒక వ్యక్తి అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవడం మామూలు విషయం కాదని, అలాంటి అరుదైన ఘనత అంబేద్కర్‌కే దక్కిందన్నారు. దేశ స్వాతంత్రం వచ్చాక 1950 నుంచి ఇప్పటివరకు ప్రపంచంలో భారత్‌ బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఘనతకెక్కిందని, అందుకు కారణం అంబేద్కర్‌ ఎంతో ముందుచూపుతో రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ కె చంద్రశేఖరరావు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారతాధికారి షాహిద్‌ బాబు, జిల్లా వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కామరాజు, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి దుర్గాకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. బందరు లక్ష్మీ టాకీస్‌ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, ఎంపి వల్లభనేని బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. ఏపీ ఎస్సీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కృష్ణాజిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మి టాకీస్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మద్దాల కృష్ణకుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు కోడూరు బుల్లయ్య, కొండ్రు రాజు, కోసనం క్రాంతి కుమార్‌, జిల్లా ట్రెజరర్‌ దాసి జయప్రకాష్‌, ఎపి.ట్రేజరీస్‌ సర్వీసెస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగుల శోభన్‌బాబు తదితరులు పాల్గోన్నారు. గన్నవరం: గన్నవరం జడ్పీ బాలుర హైస్కూల్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కెవిఆర్‌ కిషోర్‌, ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు పాల్గొన్నారు. చిన్న ఆవుటపల్లి గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహానికి గన్నవరం నియోజకవర్గ టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నివాళులర్పించారు. చిక్కవరంలో అంబేద్కర్‌ విగ్రహానికి సర్పంచ్‌ అన్నే లక్ష్మణరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బంటుమిల్లి: కొమ్మారెడ్డి స్కూల్లో పాఠశాల డైరెక్టర్‌ కొమ్మారెడ్డి కిషోర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్కూల్‌ హెచ్‌ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. గుండాబత్తుల ఆంజనేయులు స్మారక భవనంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కన్వీనర్‌ గౌరిశెట్టి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా కన్వీనర్‌ పరిచేరి ధనశ్రీ, మండల కార్యదర్శి మాజేటి శివ శ్రీనివాసరావు, రైతు సంఘం మండల కార్యదర్శి లంకదాసుల అజరు గోష్‌, వంగల రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొడ్డు నాగరాజు, గౌరిశెట్టి నాగేశ్వరావు పాల్గొన్నారు. చల్లపల్లి: గంగులవారిపాలెం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి సిపిఎం మండల కార్యదర్శి యద్దనపూడి మధు, సీనియర్‌ నాయకులు వాకా రామచంద్రరావు, మండల కమిటీ సభ్యులు మహమ్మద్‌ కరీముల్లా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మీర్‌ రిజ్వాన్‌, మాజీ ఎంపీటీసీ సభ్యులు జగ్గారపు బాబురావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చల్లపల్లి పంచాయతీ బోర్డు పాలకవర్గ సభ్యులు మీర్‌ రిజ్వాన్‌ గారి ఆధ్వర్యంలో చల్లపల్లి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కంకిపాడు: గొడవర్రులో మాదిగల సంఘం ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వెంట్రప్రగడ మరియదాసు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరు ప్రధాన సెంటర్లో మండల జై భీమ్‌ యూత్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెయ్యల సురేష్‌బాబు, పులి వెంకటరత్నం, పాగోలు సునీల్‌ పాల్గొన్నారు. మచిలీపట్నం రూరల్‌: జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో బండి రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణాజిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం పట్టాభి భవనంలో జరిగిన కార్యక్రమంలో మచిలీపట్నం కాంగ్రెస్‌ అభ్యర్థి అబ్దుల్‌ మతీన్‌, నల్లబోలు కుమారి పాల్గొన్నారు. వైసిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు ) అంబేద్కర్‌కు నివాళులర్పించారు. గూడూరు: పెడన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ గూడూరు, ఆకుమర్రు, మల్లవోలు, పోలవరం, ఐదుగుళ్లపల్లి, రామన్నపేట, రాయవరం గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసీ నివాళులర్పించారు. పెదపారుపూడి : గురువిందగుంటలో కాంగ్రెస్‌ పార్టీ పామర్రు నియోజకవర్గ అభ్యర్థి డివై దాస్‌, వెంట్రప్రగడ గ్రామంలో సర్పంచ్‌ అప్పికట్ల ఆశాజ్యోతి, వానిపురంలో ఎన్‌డిఎ కూటమి అభ్యర్థి వర్ల కుమార్‌రాజా అంబేద్కర్‌కు నివాళులర్పించారు. పెడన: బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కటకం నాగకుమారి ప్రసాద్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుడివాడ : గౌరీశంకరపురంలోని డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ మెమోరియల్‌ భవన్‌లో ఆదిమాంధ్ర సంఘం జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజు అధ్యక్షతన జరిగిన సభలో టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, జనసేన నాయకుడు బూరగడ్డ శ్రీకాంత్‌ మాట్లాడారు. స్ధానిక ఏలూరురోడ్డులోని టిడిపి కార్యాలయంలోని ప్రజావేదికలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావ పాల్గొన్నారు. వైసిపి కార్యాలయంలో మెండా చంద్రపాల్‌, గొర్ల శ్రీను అంబేద్కర్‌కు నివాళులర్పించారు. స్థానిక అన్నే పుష్ఫలేలావతి, అన్నేనరసింహారావు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇందిరాడేవి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. పమిడిముక్కల: ఎండిఒ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కొడమంచిలి మహేష్‌, గంజల సీతారామయ్య, కంభం రాంబాబు పాల్గొన్నారు. మోపిదేవి: కొక్కిలిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్‌ దిడ్ల జానకీ రాంబాబు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అవనిగడ్డ: వైసిపి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్‌ చిత్రపటానికి సర్పంచ్‌ గోరుముచ్చు ఉమా, మాజీ సర్పంచ్‌ నలుకుర్తి పధ్విరాజు పూలమాలలు వేశారు. సీతాలంక వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ పూలదండలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దిడ్ల వీర రాఘవులు పాల్గొన్నారు. బార్‌ అసోసియేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్‌ చిత్రపటాన్ని న్యాయవాది కర్ర సుధాకర్‌ బహూకరించగా జూనియర్‌ న్యాయమూర్తి లంకె గోపీనాథ్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించి అంబేద్కర్‌ జయంతిని నిర్వహించారు.

➡️