పాడి రైతులకు అవగాహనా

May 27,2024 14:26 #Krishna district

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : మండల పరిధిలోని వేమవరం మరియు కవుతరం పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘముల నందు సోమవారం పాడి రైతు సంక్షేమం మన మతం –  అలుపెరగని సేవ మన అభిమతం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ పాడి రైతులకు అందించే ధర వ్యత్యాసం, కళ్యాణమస్తు, క్షీరభంధు, ప్రతిభా, ఆక్సిడెంట్ కేర్ ట్రస్ట్ పథకాల గురించి మరియు పాడి పశువులకు అందించే పశు భీమా, డీ వార్మింగ్, పశు దాణా, కాల్షియం, మినరల్ మిక్సర్ వాడటం వలన కలిగే ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేశారు. యూనియన్ వారు అందించే సెమెన్ ద్వారా పుట్టిన దూడలు మాత్రమే భవిష్యత్ లో ఎక్కువ పాల చార గలిగిన పశువులుగా రైతులకి అధిక లాభాలు ఆర్జించగలవని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా పాలకవర్గ సభ్యులు వి బి కే వి సుబ్బారావు , గుడ్లవల్లేరు పాల శీతల కేంద్రం మేనేజర్ తోట సత్యనారాయణ, వేమవరం సంఘ అధ్యక్షులు మన్నెం వెంకటేశ్వరరావు, సూపర్ వైజర్ పెయ్యేటి బసవ రాజ కుమార్, వేతన కార్యదర్శి జాస్తి .రామకృష్ణ, కృష్ణారావు సంఘ పాలక వర్గ సభ్యులు మరియు పాల ఉత్పత్తి దారులు పాల్గొన్నారు

➡️