భగత్ సింగ్ త్యాగం స్ఫూర్తిదాయకం

Mar 23,2024 15:16 #Krishna district

బీమా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : స్వతంత్ర సంగ్రామ చరిత్రలో భగత్ సింగ్ ది ప్రతేక స్థానం అని, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అతి చిన్న వయస్సులోనే రాజీలేని పోరాటం నడిపిన చరిత్ర భగత్ సింగ్ స్వతం అని ఐసిఇయు జాయింట్ సెక్రటరీ టి.చంద్రపాల్ అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్బముగా ఐసిఇయు ఆధ్వర్యంలో మచిలీపట్నం ఎల్ ఐ సి డివిజనల్ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన కార్యక్రమం లో పలువురు యూనియన్ నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఉరి తాళ్లనే ఉయ్యాల గా భావించి, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినదిస్తూ దేశం కోసం అమరులు అయిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల త్యాగనిరతిని భారతదేశం ఎప్పటికి మరువదు అని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఎఐఐఇఎ) మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి.కిషోర్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు జె.సుధాకర్, జి. కిషోర్ కుమార్,టి. చంద్రపాల్, వై.స్వామినాధ్, బి.హెఛ్.మాధుర్, కె.నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️