జనసేన నేత కారు దగ్ధం

May 27,2024 17:32 #Krishna district

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : మచిలీపట్నంలోని జనసేన నాయకులు కర్రి మహేష్ కారును ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును తగలపెట్టిన తీరుపై మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల తరువాత తన కారును వైసీపీ గూండాలు తగల పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️