చల్లపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆన్లైన్ సేవలు

Apr 1,2024 14:46 #Krishna district

మేనేజర్ పి రమేష్
ప్రజాశక్తి-చల్లపల్లి : స్థానిక సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడం కొరకు మన చల్లపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంకులో డిజిటల్ సేవలైన మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని మేనేజర్ పి రమేష్ తెలిపారు. స్థానిక ప్రధాన కూడలిలో కాన్వాయ్ నిర్వహించి వ్యాపారస్తులను కలిసి బ్యాంక్ సేవలను వివరించారు. ఖాతాదారుల సౌలభ్యం కొరకు అన్ని రంగంలో వారికి అనువైన రుణ సదుపాయంలో సరళమైన వడ్డీరేట్లు అందిస్తున్నామని, డిపాజిట్లపైన అత్యధిక వడ్డీరేట్లను అందిస్తున్నము అని బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీతో ఖాతాదారులకు సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాషియర్ వి తేజేంద్ర గోల్డ్ అప్రైజర్ నాగబాబు బ్యాంక్ సిబ్బంది అనిల్ పాల్గొన్నారు.

➡️