IPL Live Updates: 113 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్‌ అలౌట్‌..

May 26,2024 21:15 #Cricket, #IPL, #Sports

చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఫైనల్లో 113 పరుగులకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అలౌట్‌ అయ్యింది. చివరి వికెట్‌గా జట్టు కెప్టెన్‌ ప్యాట్‌కమిన్స్‌ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌.. కేకేఆర్‌ బౌలర్ల దాటికి 18.3 ఓవర్లలోనే అలౌట్‌ అయ్యింది. అభిషేక్‌ శర్మ (2), ట్రావిస్‌ హెడ్‌ (0), రాహుల్‌ త్రిపాఠి (9) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. మార్క్రమ్‌ (20), నితీశ్‌ రెడ్డి (13), క్లాసెన్‌ (16) పరుగులు చేశారు. చివర్లో పాట్‌ కమిన్స్‌ (24) పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. కోల్కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్‌ 3, మిచెల్‌ స్టార్క్‌ 2, హర్షిత్‌ రాణా 2, వైభవ్‌ అరోరా, నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి తలో వికెట్‌ తీశారు.

  • 16 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ 98/8

ఎస్ఆర్‌హెచ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 ప‌రుగులు చేసిన క్లాసెన్‌.. హర్షిత్ రానా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. క్రీజులో ఉన‌ద్క‌ట్ వ‌చ్చాడు. 16 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్‌: 98/8

  • స‌మ‌ద్ ఔట్‌..

ర‌స్సెల్ బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన స‌మ‌ద్ సైతం ఔట‌య్యాడు. క్రీజులో క్లాసెన్‌(13), కమ్మిన్స్ 4 పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్‌: 82/7

  • కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌.. 71/6

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ కష్టాల్లో పడింది. 12 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 71 పరగులు చేసింది. 6వ వికెట్‌గా షాబాజ్‌ అహ్మద్‌ పెవిలియన్‌కు చేరాడు. అంతకు ముందు అభిషేక్‌ (2), త్రిపాఠి (9),హెడ్‌ (0), మార్కరమ్‌(20), నితీష్‌ రెడ్డి (13) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం క్రీజులోకి అబ్దుల్‌ సమాద్‌ వచాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ 12 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

మార్కరమ్‌ ఔట్‌.. ఎస్ఆర్‌హెచ్ 62/5

20 పరుగులు చేసిన మార్కరమ్‌ రసెల్‌ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి షాబాజ్‌ అహ్మద్‌ వచ్చాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ 12 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • నాలుగో వికెట్‌ డౌన్‌.. నితిష్‌ రెడ్డి ఔట్‌

హైదరాబాద్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. నితీష్‌ రెడ్డి (13) ఔటయ్యాడు. హర్షిత్‌ రాణా వేసిన ఏడో ఓవర్లో తొలి బంతికి ఫోర్‌ బాదిన నితిష్‌ చివరి బంతికి వికెట్‌ కీపర్‌ గుర్బాజ్కు క్యాచ్‌ ఇచ్చాడు. 7 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోరు 47/4. మార్క్రమ్‌ (16) పరుగులతో ఉన్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ బ్యాటింగ్‌కు దిగాడు.

పవర్‌ ప్లే పూర్తి.. ఎస్ఆర్‌హెచ్ 40/3

పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి ఎస్ఆర్‌హెచ్ మూడు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. మార్కరమ్‌ 11 బంతుల్లో 15, నితిష్‌ రెడ్డి 6 బంతుల్లో 8 పరుగులు చేశారు. అంతకు ముందు అభిషేక్‌ 2, త్రిపాఠి 9, హెడ్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు.

  • రాహుల్‌ త్రిపాఠి ఔట్‌..

13 బంతుల్లో 9 పరుగులు చేసిన రాహుల్‌ త్రిపాఠి స్టార్క్‌ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి నితిష్‌ రెడ్డి వచ్చాడు. మరో వైపు మార్కరమ్‌ 5 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • హెడ్‌ ఔట్‌..

ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ గోల్డెన్ డ‌క్‌గా వెన‌దిరిగాడు. వైబవ్ ఆరోరా బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి హెడ్ పెవిలియ‌న్‌కు చేరాడు.

  • అభిషేక్ ఔట్‌

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ వికెట్‌ను ఎస్ఆర్‌హెచ్ కోల్పోయింది. 2 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ‌.. స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.

  • టాస్‌ గెలిచిన హైదరాబాద్‌.. తొలుత బ్యాటింగ్‌

రెండు నెలలుగా క్రికెట్‌ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్న ఐపీఎల్‌-17 ఫైనల్‌ దశకు చేరుకుంది. చెన్నైలో జరుగుతున్న ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా.. హైదరాబాద్‌ జట్లు తలపడుతున్నాయి. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ): రహ్మానుల్లా గుర్బాజ్ (), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ , రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ , భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్

➡️