మతోన్మాద శక్తులను ఓడించండి

Apr 21,2024 23:23
  • ఆరుగొలనులో సిపిఎం నేతల విస్తృత పర్యటన

ప్రజాశక్తి-గుడివాడ 

మతోన్మాద బిజెపిని దానికి మద్దతు ఇస్తున్న టిడిపి, జనసేన, వైసిపి పార్టీలను ఓడించాలని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు మండలం ఆరుగొలను, ఒగిరాల గ్రామాల్లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సిపిఎం నాయకులు విస్తృతంగా పర్యటించారు. తొలుత ఆరుగొలను సెంటర్లో ఉన్న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఓటర్లను కలిసి తన విజయానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి వంగపండు రామకృష్ణ, మండలకార్యదర్శి బేత శ్రీనివాసరావు, నాయకులు అబ్దుల్‌ బారి, తోట సాంబశివరావు, బలుసుపాటి శ్రీనివాసరావు, చింత వీరరాఘవయ్య, జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, ఆర్‌సిపి రెడ్డి, రాష్ట్ర నాయకులు కొల్లాటి శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, కృష్ణాజిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు మర్రాపు పోలినాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సమరం, సమీర్‌, మహిళా సంఘం నాయకులు రజిని, వీరమ్మ, ప్రజానాట్యమండలి నాయకులు ప్రభుదాస్‌, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.రాజీవ్‌కాలనీలో కరపత్రాలు పంపిణీప్రజాశక్తి-గన్నవరం: ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావుకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ రాజీవ్‌ కాలనీలో ఆదివారం సాయంత్రం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ కొండా వీరాస్వామి మాట్లాడుతూ దేశంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి, టిడిపిల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జగన్‌ పోకడ వల్ల ఇసుక ధరలు అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికుల బతుకులు దెబ్బతిన్నాయన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తున్న మోడీని, ఆయనకు మద్దతు పలుకుతున్న వైసీపీ, టిడిపిలను ఓడించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి జయమ్మ, నక్క వెంకటేశ్వరరావు, మీరాఖాన్‌, తిరువీధి సుబ్బారావు, మోటమర్రి నాగ బ్రహ్మచారి, షేక్‌ బాజీ, మహమ్మద్‌ కరీముల్లా, నక్క శివ తదితరులు పాల్గొన్నారు.

➡️