వాలంటీర్లపై కపట ప్రేమ : నాని

Apr 9,2024 22:50

ప్రజాశక్తి-గుడివాడ

వాలెంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్న చంద్రబాబు నేడు వాలంటీర్లపై కల్లబొల్లి ప్రేమ వలకపోస్తున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం గుడివాడ వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు కుటీల వాగ్దానాలను ఎవరు నమ్మరని ప్రజల్లో తిరుగుబాటు రావడంతోనే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నాడన్నారు. ప్రభుత్వ సేవలను నేరుగా పేద మధ్య తరగతి వర్గాలకు వాలంటీర్ల ద్వారా అందించడంతో సీఎం జగన్‌ ప్రభుత్వం పై ప్రజలందరికీ నమ్మకం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణాధ్యక్షుడు గొర్ల శ్రీను, నాయకులు పాలేటి చంటి, ఎంవి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️