లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం

Dec 16,2023 15:46 #Krishna district
lions club eye checkup

ప్రజాశక్తి-చల్లపల్లి : లయన్స్ క్లబ్ ఆఫ్ చల్లపల్లి వి.ఆర్.కె.నగర్ ఆధ్వర్యాన ఉచిత వైద్య కంటి శిబిరాన్ని శనివారం నర్రా రమాదేవి సాయిబాఋ లయన్స్ మల్టీపర్పస్ సర్వీస్ సెంటర్ భవనంలో లయన్ రాయపాటి రాధాకృష్ణ సౌజన్యంతో నిర్వహించారు. ఈ శిబిరంలో 59 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 9 మందిని ఆపరేషన్ కు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమం నందు క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ తగిరస సాంబశివరావు, లయన్ ఆర్ రాధాకృష్ణ, సెక్రటరీ, లయన్ నర్రా సాయిబాఋ, కోశాధికారి, లయన్ యం.వి. కృష్ణారావు, సహ అధ్యక్షులు, లయన్ కె.సుధాకరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️