క్రీడా రంగానికి పెద్దపీట

Jan 10,2024 20:48

కౌతాళంలో పోటీలను ప్రారంభిస్తున్న ప్రదీప్‌రెడ్డి

– వైసిపి యువనేత ప్రదీప్‌ రెడ్డి
ప్రజాశక్తి – కౌతాళం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలనలో క్రీడారంగానికి పెద్ద పీట వేసినట్లు వైసిపి రాష్ట్ర యువ నాయకులు ప్రదీప్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ‘ఆడుదాం ఆంధ్ర’ మండల స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’కు శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడా రంగాల్లో రాణించాలని తెలిపారు. ఉరుకుంద ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ నాగరాజు గౌడ్‌, వైసిపి మండల కన్వీనర్‌ దేశాయి ప్రహ్లాద చారి, సర్పంచి పాల్‌ దినకరన్‌, ఎంపిపి అమ్రేష్‌, వైస్‌ ఎంపిపి బుజ్జి స్వామి, కో ఆప్షన్‌ సభ్యులు మాబు సాబ్‌, ఉప సర్పంచి తిక్కయ్య, నాయకులు ఏకం రెడ్డి, రామన్న గౌడ్‌, రాఘవేంద్ర రెడ్డి, ఎంపిడిఒ సుబ్బరాజు, ఎంఇఒ సుధారాణి పాల్గొన్నారు.

➡️