ప్రతి వార్డులోనూ సిమెంట్‌ రోడ్లు

Jan 13,2024 19:58

భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి

– ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి
ప్రజాశక్తి – ఆదోని
ఇచ్చిన హామీ మేరకు పట్టణంలోని ప్రతి వార్డులోనూ రోడ్లు, డ్రెయినేజీలు యుద్ధప్రాతపదికన ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌ రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని 6వ వార్డు హౌసింగ్‌ బోర్డు కాలనీలో వార్డు కౌన్సిలర్‌ సునీత అధ్యక్షతన ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి మాట్లాడారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కింద ప్రతి వార్డుకూ రూ.20 లక్షలు మంజూరవుతున్నాయని వివరించారు. నిధులతో సిమెంటు రోడ్డు, డ్రెయినేజీ ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. 6వ వార్డులో రూ.40 లక్షలతో అన్ని రోడ్లూ బాగు చేయిస్తామన్నారు. ఓర్వలేని వారు చేస్తున్న విమర్శలను పట్టించుకోబోమని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధి, మంచి పనులను ప్రజలు నమ్ముతున్నారని, వారి ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ శాంత, మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన్‌ కామాక్షి తిమ్మప్ప, వైసిపి ఇన్‌ఛార్జీ జయ మనోజ్‌ రెడ్డి, కాంట్రాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, అక్షరశ్రీ రామకృష్ణారెడ్డి, బికె.లక్ష్మన్న, పరిగెలా నారాయణ ఉన్నారు.

➡️