నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలి : ఎస్ఎఫ్ఐ

Jun 20,2024 17:24 #Kurnool, #neet exam, #SFI

ప్రజాశక్తి కర్నూలు – కలెక్టరేట్ : నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ డిమాండ్ చేశారు.
గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూల్ నగరంలోని గాయత్రి స్టేట్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ అధ్యక్షతన జరిగిన ధర్మాలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ మోడీ 3.0 ప్రభుత్వం అక్రమాలకు కేరఫ్ అడ్రస్ గా మారిందన్నారు.. నీట్ పరీక్షల్లో 720 మార్కులకు 720 మార్కులను 67 మంది సాధించినట్లు హర్యానాలోని ఒకే పరీక్ష కేంద్రంలో 6 మందికి 720 మార్కులు రావడం జరిగిందన్నారు. నెగిటివ్ మార్కులు ఉన్నప్పటికీ ఎక్కువ మార్కులు రావడం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయన్నారు., పరీక్షకు సమయం తక్కువగా ఉంది అనే కారణంతో 1564 మందికి గ్రేస్ మార్కులు కలపడం కలిపారు. సమయం ఎవరికి తక్కువ ఉందన్నారు. బీహార్ హర్యానా గుజరాత్ రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారన్నారు. వెంటనేకేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష ను తిరిగి నిర్వహించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు అమర్ ఉపాధ్యక్షులు భాస్కర్ అబూబకర్ సహాయ కార్యదర్శులు మల్లేష్ ఆర్యన్ నగర నాయకులు యోగి, ఆదిత్య చరణ్ వందలాదిమంది నీట్ అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️