ప్ర‌జా ప్రత్యక్ష సేవలో రెవెన్యూ శాఖ కీలకం

Jun 20,2024 17:16 #Kurnool

పోటో ప్రసాద్ రావు ను సన్మానించిన సబ్ కలెక్టర్

ప్రజాశక్తి – ఆదోని : ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ కీలకమైంద‌ని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. గురువారం సబ్ కలెక్టర్ వారి కార్యాలయం ఆవరణంలో రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, రైతులు, రెవెన్యూ సిబ్బంది, సబ్ కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స‌బ్ క‌లెక్ట‌ర్‌ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం మునుపు నుండే రెవెన్యూ శాఖ పుట్టుకొచ్చిందన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి కార్యక్రమానికి రెవెన్యూ శాఖతో ప్రతి వ్యక్తికి పుట్టుక నుండి మరణం వరకు రెవెన్యూ శాఖతో అనుసంధానం కలిగి ఉంటుందన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, మరణ ధ్రువీకరణ పత్రం రెవెన్యూ శాఖ ద్వారానే పొందాల్సి ఉంటుంద‌న్నారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకం, ఆర్వార్, అడంగల్, భూమి యెక్క చుట్టూ కొలతలు సంబంధించిన పత్రాలు ధ్రువీకరణ చేస్తూ ఎప్పటికప్పుడు రైతులకు సేవలందిస్తున్నామన్నారు.

పదవి విరమణ పొందిన రెవెన్యూ అధికారుల అనుభవాలను, సందేశాలను రైతులకు, ఇప్పటి రెవెన్యూ సిబ్బందికి తెలియజేశారు. అనంతరం రెవెన్యూ శాఖలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన అధికారులకు సబ్ కలెక్టర్ వారిచేత సన్మానించి ప్రశంసపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయపు పరిపాలన అధికారి సిఆర్ శేషయ్య, తహశీల్దార్ హసీనా సుల్తానా, డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్‌ ఆఫ్ సర్వేర్ వేణు సూర్య, ఉప త‌హ‌శీల్దార్లు రామేశ్వర్ రెడ్డి, వలి బాష, పెద్దయ్య, దీపా, కౌసర్ బాను, వినీత్, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు తహశీల్దార్‌ ఈరన్న, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సీనియర్ నాయకులు మోహన్ రావు పాల్గొన్నారు.

➡️