ప్రభుత్వ మొండి వైఖరి వీడాలి

Jan 13,2024 19:52

ఆలూరులో మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు

– రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు
ప్రజాశక్తి-ఆలూరు
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు డిమాండ్‌ చేశారు. శనివారం ఆలూరులో అంగన్వాడీలు చేస్తున్న 33వ రోజు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ఎమ్మెల్యేలకు రూ.లక్షల వేతనాలు, టిఎ, డిఎ, అలవెన్స్‌లు, పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయని తెలిపారు. చాలీచాలని వేతనాలతో నిత్యావసర ధరలు, విద్యుత్‌, బస్సు, కూరగాయల ధరలు పెరిగి అప్పులతో నెట్టుకొస్తున్న అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనాలు పెంచడానికి డబ్బులు లేవని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నాయకులు కృష్ణ, షాకీర్‌, గోవర్ధన్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు బాలరంగమ్మ, భారతి, లక్ష్మీ, సరస్వతి, సుజాత, ప్రభావతి, పుష్పవతి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

➡️