భువనేశ్వరికి ఘన వీడ్కోలు

Jan 10,2024 20:45

భువనేశ్వరికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మల్లప్ప

ప్రజాశక్తి – ఆదోని
‘నిజం గెలవాలి’లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన సాగింది. మంగళవారం రాత్రి ఆదోనిలోని చేకూరి ఫంక్షన్‌ హాలులో ఆమె బస చేశారు. బుధవారం భారీ ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు చేకూరి ఫంక్షన్‌ హాలు వద్దకు చేరుకున్నారు. టిడిపి ఇన్‌ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భువనేశ్వరికి పుష్పగుచ్ఛం అందజేసి టిడిపి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. బైపాస్‌ రోడ్డు మీదుగా ఎమ్మిగనూరుకు చేరుకున్నారు. అంతకుముందు ఆదోనిలో ఆమెకు టిడిపి, జనసేన నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. టిడిపి జిల్లా అధ్యక్షులు బిటి.నాయుడు, టిడిపి జిల్లా పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి భూపాల్‌ చౌదరి, కార్యదర్శి బుద్ధారెడ్డి, తిమ్మప్ప, రంగస్వామి నాయుడు, మారుతి నాయుడు, టిడిపి సీనియర్‌ నాయకులు సూరం భాస్కర్‌ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, సౌదీ రావుఫ్‌, ఉమ్మి సలీం, రామచంద్ర, సోమశేఖర్‌ రెడ్డి, టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె ఆది కృష్ణమ్మ, గుడిసె శ్రీరాములు, జనసేన ఇన్‌ఛార్జీ మల్లప్ప, నాయకులు రాజశేఖర్‌, ప్రకాష్‌, పులి రాజు ఉన్నారు.

➡️