మౌలిక సదుపాయాలకు పెద్దపీట

Dec 18,2023 19:34

కొలతలను పరిశీలిస్తున్న ఇఒఆర్‌డి బాలన్న

– ఇఒఆర్‌డి బాలన్న
– డ్రెయినేజీతో కూడిన కాలువల నిర్మాణానికి కొలతలు
ప్రజాశక్తి – చిప్పగిరి
గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నామని ఇఒఆర్‌డి బాలన్న తెలిపారు. సోమవారం మండలంలోని నేమకల్లు గ్రామంలో ప్రధాన రహదారి అయిన రాంపురమయ్య వీధిలో సిసి రోడ్డు నిర్మాణాలను పరిశీలించారు. అలాగే గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారిలో డ్రెయినేజీ కాలువలు నిర్మించడానికి అధికారుల చేత కొలతలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిసి రోడ్డు ఉన్నా, డ్రెయినేజీ కాలువలు లేకపోవడంతో కలుషితమైన మురుగునీరు రోడ్డుపై నిల్వ ఉంటోందని తెలిపారు. దోమల వ్యాప్తి చెంది అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. వీటన్నింటినీ గమనించి వెంటనే డ్రెయినేజీ కాలువలు నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. పనులు కూడా వారం రోజుల్లోపు మొదలు పెడతామని తెలిపారు. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ లక్ష్మి, గ్రామ సేవకులు హుస్సేని పాల్గొన్నారు.

➡️