వైఎస్‌ఆర్‌ బీమా అందజేత

Jan 13,2024 19:56

ఆర్థిక సాయం అందజేస్తున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి – కోసిగి
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసిపి మండల ఇన్‌ఛార్జీ మురళీ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు మండల నాయకులు, అగసనూరు సర్పంచి ఉలిగయ్య, మాజీ సర్పంచి ఆకాష్‌ రెడ్డి ఆధర్వంలో వైఎస్‌ఆర్‌ బీమా కింద రూ.10 వేల ఆర్థిక సహాయం శనివారం అందజేశారు. గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో దాసరి సురేష్‌ మృతి చెందారు. వైఎస్‌ఆర్‌ బీమా కింద రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని గీతకు అందజేశారు. అనంతరం మాజీ సర్పంచి ఆకాష్‌ రెడ్డి మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ బీమా కింద నగదు అందజేశామని, మిగిలిన మొత్తం నామిని ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. నాయకులు గోర్లి శివయ్య, చిన్నముతి ఉలిగయ్య, హనుమప్ప, నర్సయ్య, భీమన్న, నాగేంద్ర, యువ నాయకులు బాబు రెడ్డి, బసన్న, నాగరాజు, సతీష్‌ పాల్గొన్నారు.

➡️