సూర్యనారాయణ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం

Jan 5,2024 20:33

సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నాయకులు

– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు
ప్రజాశక్తి – ఎమ్మిగనూరు
సిఐటియు జిల్లా నాయకులు, సిమెంట్‌ నగర్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మిక నాయకులు, బేతంచెర్ల కార్మిక ఉద్యమ నిర్మాత సూర్యనారాయణ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి.రామాంజనేయులు, డివిజన్‌ అధ్యక్షులు గోవిందు తెలిపారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్‌లో సూర్యనారాయణ 35వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 1988 జనవరి 5న అప్పటి కాంగ్రెస్‌ నాయకులు కిరాయి గుండాలను పెట్టి సూర్యనారాయణను హత్య చేశారని తెలిపారు. సూర్యనారాయణ కార్మిక ఉద్యమాలను నిర్మించడంలో అగ్రగామిగా ఉండేవారని చెప్పారు. కార్మిక పక్షపాతిగా ఉండి, కార్మిక సంఘాలను నిర్మించడంలో ముందుండేవారని కొనియాడారు. యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా నాయకులు ఎ.నాగరాజు, కార్మికులు పాల్గొన్నారు.

➡️