సేవా పథకం ప్రత్యేక శిబిరం పరిశీలన

Jan 29,2024 19:41

శిబిరాన్ని పరిశీలిస్తున్న డాక్టర్‌ అరుణ

ప్రజాశక్తి – ఆదోని
ఆదోని ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల ఆధ్వర్యంలో మాలపల్లిలో జరుగుతున్న ఏడు రోజుల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని రాయలసీమ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అరుణ గంధం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ… కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు అద్భుత రీతిలో క్యాంపులో పాల్గొంటూ ఆడపిల్ల చదువు, ఆరోగ్య పరిరక్షణ, నిరక్షరాస్యత నిర్మూలన, బహిరంగా మలవిసర్జన, వేప చెట్ల ఉపయోగం తదితర విషయాలపై అవగాహన కల్పించారని తెలిపారు. క్యాంపు నిర్వహణ తీరు పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్‌ డేనియల్‌ ప్రేమ్‌ కుమార్‌ సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తూ వాలంటీర్లకు తర్ఫీదునిచ్చారు. రసాయన ఎరువుల వాడకం ఆరోగ్యానికి మంచిదికాదని, సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయనికి ఎరువులు ఎలా తయారు చేయాలో వాలంటీర్లకు ప్రయోగాత్మక రీతిలో అగ్రికల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారి స్వామి తర్ఫీదునిచ్చారు. గ్రామాల్లో సచివాలయం సేవలు ఏ విధంగా పని చేస్తున్నాయనే విషయాన్ని పంచాయతీ సెక్రటరీ స్వామినాథ్‌ వివరించారు. హెచ్‌ఐవి/ఎయిడ్స్‌పై సంధ్య రాణి అవగాహన కల్పించారు. ఈ ప్రత్యక శిబిరాన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ డివిజన్‌ అధికారి జోనాథన్‌ విక్లీఫ్‌ పర్యవేక్షించారు.

➡️