రాష్టస్థ్రాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ లో ప్రతిభ చూపిన విద్యార్థి

Dec 16,2023 15:52 #Kurnool
adoni zph students in state level games

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : రాష్టస్థ్రాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ లో ప్రతిభ చూపిన విద్యార్థులు మండలం పరిధిలో దొడ్డనకేరి జడ్పీ హైస్కూల్ విద్యార్థి కె.శివ జ్యేష్ట ప్రతిభ కనబరిచారని పాఠశాల ప్రధానోపద్యాయులు కె.వెంకటస్వామి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 12నుండి 14వ తేదీ వరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ మీట్లో జెడ్పి హైస్కూల్ దొడ్డనకేరి విద్యార్థులు కె.శివ జ్యోష్ణ, కె.నవేశ్వరి,జి.శైలజ,కె.శివశంకర్,బి.జీ.వినోద్,సి.నీలకంఠ,ఈ.శైలజ పాల్గొన్నారు అని తెలిపారు. అందులో రాష్ట్రస్థాయి పోటీల్లో కె.శివ జ్యోష్ణా 3000మీటర్ల రేస్ వాక్లో 3వ స్థానం గెలిచిందని తెలియజేశారు.రాష్ట్ర స్థాయిలో పాల్గోని పథకాలు సాధించినందుకు విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని,ఉపాద్యాయులు తాయప్ప,జీలని,రాజేశ్వరి, సాయిబాబా, భోజరాజు,లక్ష్మీకాంత్,నాగలక్ష్మి,వేణుగోపాల్,మనోహర్,సరస్వతి,రాజశ్రీ, షేక్షవలి,నాగన్న,రేనుకాబాయి,రామోహన్ రెడ్డి,వ్యాయామ ఉపాధ్యాయుడు ఓబన్న విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️