ఉరి తాళ్లతో క్లాప్ డ్రైవర్ల నిరసన  

Jan 6,2024 17:19 #Kurnool
drivers protest in krnl

 

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ క్లాప్ డ్రైవర్ల సమ్మె 21వ రోజున కార్మికులు ఉరి తాళ్లు తో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఓల్డ్ సిటీ సిఐటియు నగర అధ్యక్షులు డి.అబ్దుల్ దేశాయ్ అధ్యక్షత వహించారు. 21వ రోజు సమ్మె కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ ఎస్. డబ్ల్యూ. ఎఫ్. రాష్ట్ర కోశాధికారి జె, దివాకర్, సిఐటియు నగర అధ్యక్షులు ఆర్.నరసింహులు ఓల్డ్ సిటీ నగర నాయకులు విజయ్ రామాంజనేయులు, కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులు గత 21 రోజులుగా పెండింగ్ లో ఉన్న6 నుండి 12నెలల జీతాలు ఇవ్వాలని, ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని, పని భద్రత, వీక్లీ ఆఫ్ లు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అగ్రిమెంట్ ప్రకారం 18,500 జీతం ఇవ్వాలని, న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తుంటే అధికారులు కానీ, ప్రజాప్రతిని గాని, ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం అన్నారు. కర్నూల్ నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తుందని, గాలికి చెత్తంతా డ్రైనేజీ కాలువలో పడిమురిగిపోయి దుర్గంధ వాసనతో దోమలకు నిలయాలుగా దోమలు విపరీతంగా పెరిగి పెరిగిపోయి విష జ్వరాల బారిన ప్రజలు పడే ప్రమాదం ఉన్నది. కనుక ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని అధికారాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే క్లాప్ ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించి నగరాన్ని చెత్తమయంగా కాకుండా స్వచ్ఛ నగరంగా చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలలో ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగి త్వరలో రాబోతున్న ఎన్నికల్లో ప్రజలు వైయస్సార్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు ఓల్డ్ సిటీ ఆటో యూనియన్ నగర నాయకులు కుమార్, క్లాప్ డ్రైవర్ యూనియన్ నాయకులు రఘుశేఖర్, నరేష్, ఇస్మాయిల్ నవీన్, బాబ్జి,  పరమేష్ చంద్రశేఖర్, మొదలగు వారు పాల్గొన్నారు.

➡️