విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలి

Dec 18,2023 15:37 #Kurnool
electricity-contrator-workers-protest

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు పి.నాగరాజు సిఐటియు జిల్లా నాయకులు కె.ప్రభాకర్ ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు అయిపోతే ఏడువు చూడండి తెలంగాణలో వలె  నేరుగా పేమెంట్ ఇవ్వాలి. స్కిల్ కార్మికులకు నెలకు 43,162 రూపాయలు చెల్లించాలి. కనీసం 2022 పిఆర్సి ప్రకారం బేసిక్ వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి అందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. నూతన షిఫ్ట్ ఆపరేటర్లకు వాచ్మెన్ గా పనిచేస్తున్న స్విఫ్ట్ ఆపరేటర్లుగా నియమించబడిన వారికి పాత ఆపరేటర్స్ తో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. బిల్ కలెక్షన్ ఏజెంట్లకు, ఎస్పీఎం కార్మికులకు విద్యుత్ స్టోర్ హమాలి లకు పీస్ రేటు రద్దుచేసి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్కో లో సిబిడి కార్మికులకు ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం, కోలుకునేదాకా ప్రత్యేక సెలవులు ఇచ్చి వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. మహిళా ఉద్యోగులకు ఇతర శాఖలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సమానంగా ఏడాది ప్రత్యేక సెలవులు అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులందరూ పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ ఉన్నందున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెనిగిన దానితో కలిపి రూ26,700 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. తద్వారా రాష్ట్రంలో 30 వేల మంది కాంటాక్ట్ కార్మికులకు యాజమాన్యం తీవ్ర అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత నాలుగు సంవత్సరాలు గడిచిపోయిన దాని ఊసే ఎత్తడం లేదని అన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే నేడు నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు రమణాచార్జీలు ,ఇంటి అద్దేలు, కరెంట్ చార్జీలు విద్యా, వైద్యం ,అంగడి సరుకుల మారాయి వీటి కనుగుణంగా కాంటాక్ట్ కార్మికులకు పీస్ రేటు పద్ధతిని పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచడానికి ప్రభుత్వము అధికారులకు మనసు రావడంలేదని వేయబడ్డారు.విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ,ఎస్సీ ,ఎస్టీలకు ఇస్తున్న రాయితీలను అమలు చేస్తున్న విద్యుత్ సంస్థకు ఆ సొమ్మును ప్రభుత్వాలు పూర్తిగా చెల్లించడం లేదన్నారు. దీనివల్ల సంస్థ నష్టాలు వచ్చేలా చేస్తున్నాయని, ప్రభుత్వం వాటిని సంస్థలకు చెల్లించే లాభాలతో డిస్కంలో నడుస్తున్నాయి. ఆధాని వంటి సంస్థల నుండి అధిక ధరలపై బొగ్గును ప్రభుత్వాలేకోనిపిస్తున్నాయి. స్మార్ట్ మీటర్ల పేరుతో ట్రాన్స్ఫార్మర్ల పేరుతో అత్యధిక లాభాలతో కంపెనీలు కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నాయని ఆరోపించారు .ఈ విధానాలే విద్యుత్ సంస్థకు నష్టాలు బాట పట్టిస్తున్నాయని చెప్పారు. సంస్థ పరిరక్షణ కోసం పనిచేస్తున్న వారి హక్కులను కాపాడాలని వెంటనే కాంటాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఈ ఓబులేసుకు వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. అందుకు ఆయన స్పందించి మాట్లాడుతూ మీ సమస్యలను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదోని డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కె. భీమేష్, ప్రవీణ్ కుమార్, స్టోర్ రూం హమాలీ యూనియన్ నాయకులు మోహన్, చలపతి, జావీద్, నాగరాజు, మద్దిలేటి కాంటాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

➡️